
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా గుజరాత్ రాష్ట్రం సోలార్ విప్లవంలో అగ్రస్థానంలో నిలిచింది.
మార్చి 2027 నాటికి 10 లక్షల ఇళ్లకు సోలార్ పవర్ అందించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా, ఇప్పటికే 9.08 లక్షల ఇళ్లపై 3,408 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానెళ్లను అమర్చారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వినియోగదారులు 2.18 కిలోవాట్ల సామర్థ్య సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కేవలం 5 శాతం నగదు చెల్లిస్తే సరిపోతుందని, మిగతా వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు.