
కాంగోలోని ఉగాండా సరిహద్దు సమీపంలో ఉన్న బనానా ఎన్ కోల్ గ్రామంపై ఇస్లామిక్ స్టేట్ ముఠా శనివారం దాడి చేసింది.
ఈ దాడిలో 13 మంది పౌరులు మరణించగా, నివాసాల్లోని విలువైన వస్తువులను దోచుకుని ఇళ్లను తగులబెట్టినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటన ప్రాంతీయ రాజధాని మాంబాసా శివార్లలో జరిగిందని స్థానిక అధికారులు వెల్లడించారు.