
ఇండోనేసియాలో శనివారం సంభవించిన భారీ భూకంపం కారణంగా ఆదివారం నాటికి మృతుల సంఖ్య 51కి పెరిగినట్లు అధికారులు ధృవీకరించారు.
ఈ ప్రకృతి వైపరీత్యంలో 101 మంది గాయపడగా, 900కు పైగా ఇళ్లు పూర్తిగా, 450 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని రెస్క్యూ బృందాలు తెలిపాయి.
ప్రస్తుతం 5,000 మందికి పైగా బాధితులు తాత్కాలిక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారని తూర్పు ఇండోనేసియా అధికారులు వెల్లడించారు.