
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెప్టెంబర్ 8న గంటపాటు ఫోన్లో చర్చలు జరిపారు.
ఉక్రెయిన్ యుద్ధాన్ని త్వరగా ముగించాలని ట్రంప్ సూచించగా, దీనికి పుతిన్ అంగీకరించినట్లు రష్యా విదేశాంగ శాఖ అడ్వైజర్ యూరీ ఉషాకోవ్ తెలిపారు.
యుద్ధం ముగిస్తే వాషింగ్టన్-మాస్కో మధ్య వాణిజ్య సంబంధాలు బలపడతాయని, ఖైదీల మార్పిడి ప్రక్రియను కొనసాగించాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు.