
వైకాపా హయాంలో జరిగిన గ్రూప్-1 నియామకాల్లో నిబంధనలకు విరుద్ధంగా డిజిటల్, మాన్యువల్ మూల్యాంకనాలు జరిగాయని కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ తన 132 పేజీల నివేదికలో వెల్లడించింది.
అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తన మిత్రుల సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా డిజిటల్ మూల్యాంకనం, హాయ్‌ల్యాండ్ రిసార్ట్ మాన్యువల్ మూల్యాంకన కాంట్రాక్టులను కట్టబెట్టారని సిట్ పేర్కొంది.
సిట్ పరీక్షకు పంపిన 736 మంది ఓఎమ్మార్ పత్రాలలో 95% పత్రాల్లో సవరణలు ఉన్నాయని, డిజిటల్ మూల్యాంకనంలో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన 326 మందిలో 202 మందికి మాన్యువల్ జాబితాలో చోటు దక్కలేదని తేలింది.