
కోల్కతాలోని నీల్రతన్ సర్కార్ (NRS) మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో బుధవారం రాత్రి 30 ఏళ్ల నర్సు రూపాలి బర్మన్ మృతదేహం టాయిలెట్లో లభ్యమైంది.
గైనకాలజీ విభాగం హైడిపెండెన్సీ యూనిట్ (HDU)లో పనిచేసే రూపాలి, రాత్రి డ్యూటీలో రెస్ట్రూమ్కు వెళ్లి ఎంతకీ రాకపోవడంతో తోటి సిబ్బంది రాత్రి 10:27 గంటలకు తలుపులు పగులగొట్టి ఆమెను అచేతనంగా గుర్తించారు.
ఈ అనుమానాస్పద మృతిపై పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసి, 7 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.