
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం బోదిగల్లం గ్రామంలో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ స్లాబ్ ఆదివారం కూలిపోవడంతో సెంట్రింగ్ మేస్త్రి అభి తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు శిథిలాల నుంచి అతడిని బయటకు తీసి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.