
ఈ నెల 17 నుంచి 23 వరకు జరగనున్న వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకు తొలి రౌండ్లో ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబెల్‌తో పోటీ ఎదురైంది.
మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్ ఆస్ట్రియాకు చెందిన కొలిన్స్ వాలంటైన్‌తో, ఆయుశ్ షెట్టి డిఫెండింగ్ చాంపియన్ షి యుకితో తలపడనున్నారు.
డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి జోడీకి తొలి రౌండ్లో బై లభించగా, రెండో రౌండ్లో స్కాట్లాండ్ లేదా థాయ్‌లాండ్ జట్లతో పోటీ పడనున్నారు.