
దక్షిణ థాయ్‌లాండ్‌లో మంగళవారం జరిగిన ఒక స్థానిక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పిడుగుపాటుకు గురై 24 ఏళ్ల యువ ఆటగాడు సాఫ్వాన్ అవే అక్కడికక్కడే మరణించాడు.
గోలోక్ ఎఫ్ఏ కప్ టోర్నమెంట్‌లో భాగంగా శామ్‌కోల్ట్స్, అబూ ఎక్స్ నాంగ్ సిరిన్ జట్ల మధ్య వర్షంలో మ్యాచ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగి మరో 12 మంది గాయపడ్డారు.
తీవ్ర గాయాల వల్ల సాఫ్వాన్ ప్రాణాలు కోల్పోయాడని స్థానిక పోలీస్ చీఫ్ థున్ సిరిఖుంత్ ప్రకటించగా, థాయ్‌లాండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది.