
బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్డులో వెళ్తున్న ఓ వ్యక్తి తన వీపున తగిలించుకున్న గిటార్‌ను హెల్మెట్ ధరించని రెండో వ్యక్తిగా ఏఐ కెమెరా భావించింది.
హెల్మెట్ ధరించలేదనే కారణంతో ఆటోమేటెడ్ కెమెరా వాహన యజమానికి రూ. 500 చలాన్ జారీ చేయగా, బాధితుడు దీనిని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ ఘటనపై ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ కార్తీక్ రెడ్డి స్పందిస్తూ, పరిశీలనలో పొరపాటు జరిగిందని తేలితే చలాన్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.