
100కు పైగా చిత్రాల్లో నటించిన సీనియర్ నటుడు జీవీ నారాయణరావు (73) అనారోగ్యంతో గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు.
1976లో 'అంతులేని కథ' చిత్రంతో పరిచయమైన ఆయన, గ్యాంగ్ లీడర్, హిట్లర్ వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు.
నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా సేవలందించిన ఆయన మృతిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సంతాపం వ్యక్తం చేసింది.