
కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఉపయోగిస్తున్న వాహనంలో ఆయుధాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తెదేపా కార్యకర్తలపై దాడి ఘటన నేపథ్యంలో ఈ వాహనాన్ని చిప్పగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఏపీ40 డీహెచ్ 9009 నంబర్ గల ఈ వాహనంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.