
ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
ఎన్నికల సంఘం అధికారులకు కల్పించిన ప్రాసిక్యూషన్ మినహాయింపు చెల్లుబాటు అవుతుందా లేదా అనే అంశంపై కోర్టు విచారణ ప్రారంభించింది.