
గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు విధించిన ఒకరోజు పోలీస్ కస్టడీ ముగిసింది.
కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో అధికారులు సుమారు 4 గంటల పాటు విచారించిన అనంతరం, ఆయనను అంపోలు జైలుకు తరలించారు.
ఈ విచారణలో కొత్త విషయాలేవీ వెల్లడి కాలేదని, అప్పలరాజు గతంలో చెప్పిన సమాధానాలనే పునరుద్ఘాటించారని సమాచారం.