
చికెన్ లివర్లో ఐరన్, సెలీనియం, విటమిన్ బి12 పుష్కలంగా ఉండి రక్తహీనతను తగ్గించడంలో సహాయపడగా, మటన్ లివర్ జ్ఞాపకశక్తిని, నరాల బలాన్ని పెంచుతుంది.
చికెన్ లివర్ సులభంగా జీర్ణమవుతుంది, అయితే మటన్ లివర్లో జింక్, కాపర్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
లివర్లో కొలెస్ట్రాల్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్నందున గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.