
ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత స్థాయి అధికారుల కావాలనుకునే విద్యార్థుల కోసం సాక్షి ఎడ్యుకేషన్ యాప్ ప్రత్యేకంగా 'ఎన్సీఈఆర్టీ ఫౌండేషన్ బ్యాచ్'ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ కోర్సులో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఇండియన్ ఎకానమీ సబ్జెక్టులను నిపుణులైన లెక్చరర్ల ద్వారా ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తారు.
రోజుకు ఒక గంట కేటాయిస్తే చాలని, యూపీఎస్సీ మరియు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల సరళికి అనుగుణంగా ఈ కోర్సును రూపొందించినట్లు యాప్ నిర్వాహకులు తెలిపారు.