
హార్దిక్ పాండ్య ఎవ్వరూ భర్తీ చేయలేని ఆల్రౌండర్ అని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు.
అతడి లాంటి ఆటగాళ్ల కోసం వెతకడం టీమిండియా మానుకోవాలని ఆయన సూచించారు.
జట్టులో ప్రస్తుతం ఉన్న మిగతా స్థానాల మీద దృష్టిపెట్టడం మెరుగైన ఫలితాలనిస్తుందని తెలిపారు.