
తెలంగాణలో పోలింగ్ కేంద్రాల మార్పులు, విలీనం మరియు కొత్త కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారీగా పోలింగ్ కేంద్రాల మార్పుల జాబితాను ఈసీ విడుదల చేయగా, దీనిపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించింది.
ఈ మేరకు తెలంగాణ సీఈఓ కార్యాలయం బుధవారం అధికారిక మెమోను జారీ చేసింది.