
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఈరీలో శుక్రవారం చోటుచేసుకున్న భీకర కాల్పుల ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో కాల్పులకు పాల్పడిన నిందితుడు కూడా ఉన్నాడని రాష్ట్ర గవర్నర్ జోష్ షపిరో శనివారం తెలిపారు.
ఇంటి లోపల వివిధ ప్రాంతాల్లో ఐదేళ్ల బాలుడు, ఏడాది చిన్నారితో పాటు పలువురి మృతదేహాలను పోలీసులు గుర్తించారు.