
సత్య సాయి జిల్లా కదిరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్‌కు ఆగస్టు 15న జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు లభించింది.
నీతి, నిజాయితీతో విధులు నిర్వహిస్తున్నందుకు ఆయనకు ఈ పురస్కారం దక్కిందని కదిరి వాల్మీకి సంఘం నాయకులు కొనియాడారు.
ఈ సందర్భంగా స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో వాల్మీకి సంఘం నాయకులు వరప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు.