
పశ్చిమాసియాలో సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయంగా ఎల్‌పీజీ కొరత రాకుండా, కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా రిఫైనరీలు, అప్‌స్ట్రీమ్ కంపెనీలకు గరిష్ఠ ఉత్పత్తి లక్ష్యాలను విధించింది.
దేశంలోని 21 రిఫైనరీలు, అప్‌స్ట్రీమ్ కంపెనీల మొత్తం రోజువారీ ఎల్‌పీజీ ఉత్పత్తి సామర్థ్యాన్ని 63,810 టన్నులుగా నిర్ణయించినట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ లక్ష్యాల్లో భాగంగా రిలయన్స్ డీటీఏ రిఫైనరీకి రోజుకు 18,000 టన్నులు, ప్రభుత్వ రంగ రిఫైనరీలకు 31,470 టన్నులు, ఓఎన్‌జీసీ, గెయిల్ సంస్థలకు 6,460 టన్నుల ఉత్పత్తిని కేటాయించారు.