
ఈ ఏడాది ఇప్పటివరకు 281 ఐటీ కంపెనీల్లో 1,27,180 మంది ఉద్యోగాలు కోల్పోగా, అందులో 97,473 మంది తొలగింపులకు ఏఐ, ఆటోమేషన్ కారణమయ్యాయి.
2025లో లేఆఫ్స్‌లో ఏఐ వాటా 29 శాతంగా ఉండగా, ప్రస్తుతం అది 77 శాతానికి పెరిగి టెక్ పరిశ్రమలో వేగవంతమైన మార్పును సూచిస్తోంది.
కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు జనరేటివ్ ఏఐ సాధనాలను వాడుతుండటంతో, ప్రాథమిక కోడింగ్, కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.