
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చి ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
నదిలో నీటి మట్టం పెరగడంతో అధికారులు అప్రమత్తమై మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వైపు నుంచి వస్తున్న వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నదీ తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.