
జపాన్ తీర ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.
షిమా నగరానికి ఆగ్నేయంగా 58 కిలోమీటర్ల దూరంలో, భూమికి 352 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్లు యూఎస్జీఎస్ తెలిపింది.
ఈ భూకంపం కారణంగా ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదని, ప్రాణ లేదా ఆస్తినష్టం సమాచారం అందలేదని అధికారులు వెల్లడించారు.