
టీఎన్జీవోల ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావును హనుమకొండ కలెక్టరేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, మెరుగైన పీఆర్సీ, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల విడుదల కోసం బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు.
ఉద్యోగుల సమస్యలపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ తరఫున గళం వినిపిస్తామని హరీశ్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.