
ఎయిర్టెల్ తన రూ.299, రూ.579, రూ.619, రూ.649 ప్రీపెయిడ్ ప్లాన్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
పాపులర్ రూ.299 ప్లాన్ స్థానంలో రూ.349 ప్లాన్ను తీసుకురావడం ద్వారా ఎంట్రీ లెవల్ రీఛార్జ్ ధరను 16 శాతం పెంచింది.
సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకునే లక్ష్యంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని, రానున్న రోజుల్లో ఇతర టెలికాం సంస్థలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.