
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం సూర్యతేజతో హైదరాబాద్లోని జెఆర్సి కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు, నిర్మాతలు మరియు రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
బండ్ల గణేష్ స్వయంగా అతిథులను ఆహ్వానిస్తూ, సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాల ప్రముఖుల సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు.