
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో వేర్పాటువాద సంస్థ ‘బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ’ (బీఎల్ఏ) జరిపిన రెండు వేర్వేరు దాడుల్లో 25 మంది పాక్ సైనికులు మరణించారు.
జియారత్ క్రాస్ మార్గంలో 18 మంది సైనికులు, సూరబ్ జిల్లాలో రిమోట్ కంట్రోల్ బాంబు దాడిలో మరో 7 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
ఈ దాడులకు ప్రతీకారంగా బీఎల్ఏ మరియు టీటీపీకి చెందిన 48 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు పాకిస్థాన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది.