
కార్ల కొనుగోలుదారుల కోసం సెప్టెంబర్ 30 వరకు పలు ప్రీమియం ఎస్‌యూవీలు, ఈవీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయని డీలర్లు తెలిపారు.
ఫోక్స్‌వ్యాగన్, హోండా, ఎంజీ వంటి ప్రముఖ బ్రాండ్ల కార్లపై రూ.1.79 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వివిధ రకాల ప్రయోజనాలు లభిస్తున్నాయి.
అక్టోబర్ 1 నుంచి కార్ల ధరలు సుమారు 2 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నందున, కొనుగోలుదారులు చెల్లింపులు జరిపే ముందు ఇన్వాయిస్ తేదీని సరిచూసుకోవాలని సూచించారు.