
ఏళ్లుగా క్రమబద్ధీకరణ జరగక పూర్తిస్థాయి హక్కులు దక్కని సీలింగ్ భూముల్లోని నివాసాలకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది.
ఈ మేరకు సీలింగ్ భూముల్లోని కాలనీల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం తాజాగా ప్రత్యేక ఆదేశాలను జారీ చేసింది.
దీంతో ఆయా ప్రాంతాల ప్రజలకు స్థలాలపై పూర్తిస్థాయి హక్కులు లభించే అవకాశం ఏర్పడింది.