
మదనపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గ్లోబల్ హార్టికల్చర్ మరియు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
ఈ హబ్ ద్వారా రాయలసీమలో ఉద్యానరంగాన్ని గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కీలక అడుగు పడిందని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు.
ఉద్యాన పంటల సాగులో ఆధునిక సాంకేతికత, పరిశోధన, నిల్వ, ఎగుమతులకు ప్రాధాన్యత కల్పించడం ద్వారా రైతులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.