
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL) కోసం విజయవాడలో మంగళవారం ప్లేయర్ల వేలం జరుగుతోంది.
ఈ లీగ్‌లో అమరావతి, రాయలసీమ, వైజాగ్, గోదావరి పేర్లతో నాలుగు జట్లు పాల్గొంటుండగా, ఒక్కో ఫ్రాంచైజీకి ఆటగాళ్ల కొనుగోలు కోసం రూ.15 లక్షల పర్స్ కేటాయించారు.
సెప్టెంబరు 15 నుంచి 26 వరకు మంగళగిరి ఏసీఏ స్టేడియంలో జరగనున్న ఈ లీగ్‌కు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.