
బెంగళూరులో జరుగుతున్న దులీప్ ట్రోఫీలో ఈస్ట్‌జోన్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 92 పరుగులు చేసి సెంచరీని తృటిలో కోల్పోయాడు.
15 ఏళ్ల 157 రోజుల వయసులో హాఫ్ సెంచరీ సాధించిన వైభవ్, దులీప్ ట్రోఫీ చరిత్రలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
సెంట్రల్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్ కాగా, వైభవ్ తన ఇన్నింగ్స్‌లో 81 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు.