
నమీబియాతో జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా 99 పరుగుల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఓపెనర్ జోర్డాన్ హెర్మన్ 126 బంతుల్లో 150 పరుగులు చేసి అరంగేట్ర వన్డేలో సెంచరీ చేసిన ఐదో దక్షిణాఫ్రికా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
వర్షం కారణంగా 31 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో నమీబియా 162 పరుగులకే పరిమితం కాగా, సఫారీ బౌలర్ ప్రెనేలన్ సుబ్రాయెన్ 4 వికెట్లు తీశాడు.