
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందని, సోమవారం తూర్పు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నానికి బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు.
తుపాను ముప్పు నేపథ్యంలో విద్యుత్ శాఖను మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనిత అప్రమత్తం చేసి డిస్కంల సీఎండీలు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.