
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’ని డిసెంబర్ 4న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం డిసెంబర్ 3న విడుదల కానున్న నేపథ్యంలో, మరుసటి రోజే ‘లెగసీ’ని విడుదల చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
‘ఫౌజీ’ విడుదల వాయిదా పడితే ఆ తేదీని తమకు అనుకూలంగా మార్చుకోవాలనే వ్యూహంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.