
నిజామాబాద్లో మీ సేవా కేంద్రాల పేరుతో నకిలీ ధ్రువపత్రాలను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నట్లు సీపీ సాయిచైతన్య శనివారం వెల్లడించారు.
నిందితులు ప్రభుత్వ అధికారిక పత్రాలను ఫోర్జరీ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు గుర్తించి, వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ ముఠాకు సంబంధించిన వివరాలను అధికారులు మీడియాకు వివరించారు.