
హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఒక్కసారిగా కుప్పకూలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.
మృతులను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టైల్స్ కార్మికులు ఉమేశ్ కారే (34), మోపత్ (42)గా గుర్తించగా, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు.
నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా నిర్మించిన ఈ భవనం కూలడంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోని ఇద్దరు వృద్ధులు గాయపడ్డారని, బిల్డర్ సాజిద్ కోసం పోలీసులు గాలిస్తున్నారని అధికారులు తెలిపారు.