
ఖమ్మం జిల్లా సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో రూ.1,000 కోట్ల సైబర్ క్రైమ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
సత్తుపల్లికి చెందిన బొప్పన నాగప్రసాద్, రాజుగూడెంలోని మేడా సతీష్ కుమార్ ఇళ్లలో ఈ సోదాలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో ఒక బెంజ్ కారు, రెండు ల్యాప్టాప్లు, ఆరు సెల్ఫోన్లతో పాటు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.