
నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా ఉలిక్కిపడి లేవడాన్ని 'హిప్నిక్ జర్క్' అని పిలుస్తారని, ఇది కండరాలు అకస్మాత్తుగా ముడుచుకోవడం వల్ల జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
అధిక అలసట, ఒత్తిడి, ఆందోళన మరియు నిద్రలేమి వంటి కారణాలు ఈ షాక్‌లకు ప్రధాన కారణాలుగా గుర్తించారు.
నిరంతరం ఇలాంటి సమస్య ఎదురైతే వైద్యులను సంప్రదించాలని, నిద్రకు ముందు ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవడం మంచిదని సూచించారు.