
సౌదీ అరేబియాలోని అల్ జుబైల్‌లో గల ఆరామ్‌కో బెర్రీ గ్యాస్ ప్లాంటు, యెమెన్ సరిహద్దులోని జజన్ ప్లాంటులపై ఆదివారం యెమెన్‌కు చెందిన హుతీ తిరుగుబాటుదారులు భీకర డ్రోన్ దాడులు చేశారు.
ఈ దాడులకు తామే బాధ్యులమని హుతీల ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరీ ఆదివారం ప్రకటించగా, రిఫైనరీల్లో అగ్నిప్రమాదం జరిగిందని, ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చామని సౌదీ వెల్లడించింది.
మరోవైపు ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా సయ్యద్ మొజ్తబా వైమానిక దాడిలో గాయపడ్డారనే వార్తల నడుమ, ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్న 12 సెకన్ల వీడియోను ఇరాన్ మెహర్ న్యూస్ సంస్థ విడుదల చేసింది.