
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ పోటీలలో భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు మరియు లక్ష్యసేన్‌లకు కఠినమైన డ్రా ఎదురైంది.
మహిళల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగుతున్న రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సింధుకు తొలి రౌండ్‌లో బై లభించింది.
ఆమె ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్ తొమోక మియాజాకిని ఢీకొనే అవకాశం ఉంది.