2020 సెప్టెంబర్ 8న జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్ల సిరీస్-VI కి సంబంధించి, ఆర్బీఐ గ్రాముకు రూ. 15,384 చొప్పున ముందస్తు విమోచన ధరను ప్రకటించింది.
2020లో గ్రాము ధర రూ. 5,067 (డిస్కౌంట్తో) ఉండగా, ప్రస్తుతం రూ. 15,384 ధరతో ఇన్వెస్టర్లకు ఆరేళ్లలో 204 శాతం రాబడి లభించింది.
వార్షిక 2.50 శాతం వడ్డీతో కలిపి, రూ. 1 లక్ష పెట్టుబడిపై ఇన్వెస్టర్లకు మొత్తం రూ. 3.20 లక్షల వరకు రాబడి పొందే అవకాశం ఉందని గణాంకాలు చెబుతున్నాయి.