
భారత సెమీకండక్టర్ రంగంలోకి అంతర్జాతీయ మరియు దేశీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు భారీగా వెల్లువెత్తుతున్నట్లు మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ట్రాక్సన్ నివేదిక వెల్లడించింది.
దేశీయ సెమీకండక్టర్ రంగంలోకి ఇప్పటివరకు మొత్తం 1.4 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.13,300 కోట్ల) ఈక్విటీ పెట్టుబడులు వచ్చినట్లు తాజా నివేదిక స్పష్టం చేసింది.
ఈ రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు రాబోయే రోజుల్లో దేశీయ తయారీ సామర్థ్యాలను మరింత పెంపొందించడానికి దోహదపడతాయని భావిస్తున్నారు.