
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జీవితం జెన్-జీ సహా అన్ని తరాల వారికి గొప్ప స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
మౌనాన్నే భాషగా మలుచుకొని ఆయన అద్భుతమైన పరిపాలన అందించిన గొప్ప రాజనీతిజ్ఞుడని సీఎం రేవంత్ కొనియాడారు.
మన్మోహన్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఆయన సేవలను ప్రభుత్వం స్మరించుకుంది.