
హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకులు దాడి చేయడాన్ని నిరసిస్తూ సిరిసిల్లలో బీజేపీ ఆందోళన చేపట్టింది.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో పోలీసులతో తోపులాట జరిగింది.
దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.