
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 2 శాతం తగ్గడంతో, వరుస నష్టాల తర్వాత సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.
ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 88 పాయింట్లు పెరిగి 77,629 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 24,285 వద్ద ట్రేడయ్యాయి.
గత శుక్రవారం దేశీయ సంస్థాగత మదుపరులు (DII) వరుసగా తొమ్మిదో రోజు కొనుగోళ్లు కొనసాగిస్తూ రూ. 2,124 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.