
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల మూడో రోజున సభా కార్యక్రమాలను అడ్డుకున్నారనే కారణంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెండ్ చేశారు.
సస్పెన్షన్‌కు గురైన వారిలో కేటీఆర్, హరీశ్‌రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి కీలక నేతలు ఉన్నారు.
ఈ సస్పెన్షన్ సెషన్ ముగిసే వరకు కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించగా, దీనిని నిరసిస్తూ శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.