
భారతదేశంలోని కొందరు వాట్సాప్ వినియోగదారులకు పుట్టిన తేదీని నమోదు చేయాలని కోరుతూ కొత్త ప్రాంప్ట్ కనిపించడంతో వయోపరిమితిపై ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ విషయంపై వాట్సాప్ లేదా మెటా సంస్థలు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని, ఇది కేవలం వినియోగదారుల మధ్య చర్చగా మారిందని సమాచారం.
ఆస్ట్రేలియా వంటి దేశాల్లో 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో, భారత్లో కూడా ఇలాంటి నిబంధనలు వస్తాయేమోనని నెటిజన్లు భావిస్తున్నారు.