
ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ-2026 ప్రక్రియలో భాగంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ను ప్రామాణిక పత్రంగా అంగీకరించబోమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
జూలై 25న ప్రభుత్వం జారీ చేసిన జీవో 172 ప్రకారం పొందిన సర్టిఫికెట్లు చెల్లవని, కేవలం ఆ తేదీకి ముందు జారీ చేసిన పాత పత్రాలను మాత్రమే స్వీకరిస్తామని ఈసీ పేర్కొంది.
రాష్ట్రంలో 2,64,87,214 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించగా, వివరాల్లో తేడాలున్న 60,51,503 మందికి ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 మధ్య నోటీసులు జారీ చేయనున్నారు.